హై అలర్ట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన..!

గత 3 రోజులుగా ఎడతేరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దైపోయింది. ఒక పక్క కరోనా, మరో పక్క భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఇబ్బందులు మరికొన్ని రోజులు తప్పవని తెలుస్తుంది. ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు తెలిపారు.

rain

రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఇప్పటికే నదులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. హైదరాబాద్ రోడ్లైతే మరింత దారుణంగా తయారయ్యాయి. వర్షపు నీటితో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. దీనివల్ల వాహణదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.