తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి ఆవర్తనం ఈ రోజు కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
ఇటు నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. అయితే ఏఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షపాతం
అత్యధికంగా హస్తినాపురంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
మలక్పేట్ లో 8.9 సెంటీమీటర్లు..
కుర్మగూడలో 8.8 సెంటీమీటర్లు..
ఝాన్సీ బజార్లో 8.7 సెంటీమీటర్లు..
చార్మినార్ ,నారయణ గూడా లో 8.5 సెంటీమీటర్లు..
నాంపల్లి లో 8.1 సెంటీమీటర్లు..
ఎల్బీనగర్ లో 7.7 సెంటీమీటర్లు..
విజయనగర్ కాలనీలో 7.5 సెంటీమీటర్లు..
శేర్లింగంపల్లి లో 7.4 సెంటీమీటర్లు..
హయత్ నగర్ లో 7 సెంటీమీటర్లు..
ఆసిఫ్ నగర్ లో 6.7 సెంటీమీటర్లు..
రామంతపూర్ లో 6.5 సెంటీమీటర్లు..
బేగంబజార్ లో 6.2 సెంటీమీటర్లు..
సరూర్నగర్ ,అంబర్పేట్ లో 5.9 సెంటీమీటర్లు..
జయ గూడా లో 5.8 సెంటి మీటర్లు..
గన్ ఫౌండ్రీ లో 5 సెంటీమీటర్లు..
నాగోల్ లో 4.4 సెంటీమీటర్లు
అత్తాపూర్ లో 4.1 సెంటీమీటర్లు..
గాజుల రామారావు లో 3.5 సెంటీమీటర్లు..
బాలనగర్ లో 3 సెంటీమీటర్లు..
జీడిమెట్లలో 2.4 సెంటీమీటర్లు..
సీతాఫల్మండిలో 1.9 సెంటీమీటర్లు..
నేరేడుమెట్లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
పలు ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో మోటర్లు పెట్టి వాటిని క్లియర్ చేస్తున్న జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు..