ఏదీ ఏమైనా ఒక విషయంలో ఓటర్లకు క్లారిటీ వచ్చేసింది : కేటీఆర్

-

లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్మారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందన్నారు. హామీలపై మాట మార్చడంతో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదన్నారు.

‘దాడులు, కేసులు, కుట్రలను తిప్పికొట్టాం. 50శాతం సీట్లు బీసీ అభ్యర్థులకు కేటాయించి బీఆర్ఎస్ న్యాయం చేసింది. సీనియర్లు, బలమైన నాయకులకు మేము టికెట్లు ఇచ్చాము. చివరి నిమిషంలో వచ్చిన పారాచ్యూట్ లీడర్లకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ధీటుగా పోటీ ఇచ్చింది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ వ్యవహారం ఉంది. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మేము చేసిన పనులన్నింటిని తిరగదోడి, కొత్త జిల్లాలను రద్ద చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చిందని మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనా ఒక విషయంలో ఓటర్లకు క్లారిటీ వచ్చేసింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news