భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అవుతాడు.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

-

భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అవుతాడు అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేర్కొన్నారు.  బోరులో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మ వాడు అని..  కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయటం రాదన్నారు. కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చు. కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం.. కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండి.

అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుంది. రవి అస్తమించని ప్రతిదేశంలో కమ్మ వాడు జెండా ఎగరేస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడు.  కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడు అంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాడు అని పేర్కొన్నారు బండ్ల గణేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version