నల్గొండ జిల్లాలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

-

నల్లగొండ జిల్లా: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు సమక్షంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితుల నుండి ఒక కోటి 12 లక్షల నగదు, 30 లక్షల విలువైన రెండు కార్లు, మూడు లక్షల విలువైన 14 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

మిర్యాలగూడ సాయి దత్త అపార్ట్మెంట్లో ఐపీల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారు అనే సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. మూడు సంవత్సరాలుగా A-1 రాజేష్ టెలిగ్రామ్ యాప్ ద్వారా యాక్సెస్ తీసుకొన్న లింక్ ద్వారా బెట్టింగ్ పాల్పడుతున్నట్లు తెలిపారు ఎస్పి అపూర్వరావు. నిందితులపై 106/2023.. U/S 3 & 4 TS గేమింగ్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో A-1 రాజేష్ కుమార్ పైన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో 215/2021.. U/S 3 & 4 TS Gaming Act కింద కేసు నమోదు అయినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news