గ్రేటర్లో ఒంటరి పోటీ..జనసేన వ్యూహమిదే

-

రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలతో జనసేన అడుగులు వేస్తోందా.. ఇప్పటికే ఏపీలో బిజేపితో జత కట్టిన జనసేన, తెలంగాణాలో ఒంటరిగానే ఎందుకు పోటీ చేస్తోంది.. ఇంతకీ గ్రేటర్లో జనసేన వ్యూహమేంటీ..హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి సై అంటుంది.. అభ్యర్థును సైతం సిద్దం చేసింది.. అయితే ఈ పార్టీ ఏపీలో బిజేపితో జతకట్టింది.. మరి తెలంగాణాలో ఎందుకు ఒంటరిగా పోటీ చేస్తోందోనని ఆలోచనలో పడ్తున్నారంతా… ఇంతకీ జనసేన ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే పై పార్టీ నేతల్లోనే రకరకాల చర్చలు మొదలయ్యాయి..

గ్రేటర్ ఎన్నికల్లో ఈ సారి అన్ని పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించు కోవాలనుకుంటున్నాయి.. గతంలో ఇక్కడ పోటీ చేయని పార్టీలు సైతం, ఈ సారి జెండా నిలబెట్టుకోవాలని తపిస్తున్నాయి.. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని పార్టీలు ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యాయి.. అయితే గ్రేటర్లో ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి.. అక్కడ ఇక్కడ అన్నట్లుగా మరికొన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి..

వాస్తవానికి దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమే కాదు, తమదే గ్రేటర్ పీఠం అన్నట్లుగా పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీలతో కలిసి, అది జనసేన అయినా ఇంకేదైనా పార్టీలతో కలిసి పోటీ చేస్తే అసలుకే ప్రమాదమని బిజేపి భావిస్తుంది.. అందులో భాగంగానే బిజేపి పొత్తులకు నో చాన్స్ అని స్పష్టం చేసింది..

ఇక జనసేన విషయానికి వస్తే.. కేంద్ర కార్యాలయం ఏపీలో ఉన్నా.. హైదరాబాద్ లో తెలంగాణా కార్యాలయం ఉంది.. చాలా మంది నాయకులు కొంత కాలంగా పార్టీని నమ్ముకుని పని చేస్తోన్న వాళ్లు ఉన్నారు.. అయితే ఇక్కడ పార్టీ కోసం ఉన్న వాళ్ళకు పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలనే ఏకైక ఆలోచనతో గ్రేటర్ బరిలోకి దిగుతుంది జనసేన..గ్రేటర్లో పోటీ చేయటం మాత్రమే కాదు.. ప్రచారం కోసం పవన్ టైం కూడా కోరుతున్నారు.. అయితే కలిసి పోరాడుతున్న పార్టీలు.. ఇక్కడ ప్రచారం చేస్తే జనసేన నాయకులు ఏమని ఓట్లు అడుగుతారనే దానిపై చర్చ సాగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news