గొర్రెల కాపరైన కేఏ పాల్..వీడియో వైరల్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చాలా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రచారంలో ప్రజా శాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఎన్నడూ లేని విధంగా…. ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీని తాజాగా టార్గెట్‌ చేశారు కేఏ పాల్‌. డిగ్రీలు చేసిన యువత గొర్రెలు కాయాలా? అని కేఏ పాల్ మండి పడ్డారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకర్షిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్, మరోసారి తన స్టైల్ లో ప్రచారం చేశారు. ఈసారి గొర్రెల కాపరి వేషధారణలో కనిపించారు. గొర్రెల కాపరులు నరకం చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు చేసిన యువతకు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.