ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇవాల్టి విచారణలో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడి, ఆమెతో పాటు తొమ్మిది మందిని ఒకేసారి ప్రశ్నించనుంది.
కవితతో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్ళై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లను ఒకేసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అందులో ఏముందంటే..? అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఏపీ నేత, వ్యాపారవేత్త సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె.. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల తర్వాత రంగు మార్చి బీజేపీలో చేరారని.. ఎమ్మెల్సీ కవిత మాత్రం ఎలాంటి మరక అంటకుండా అలాగే ఉన్నారని పోస్టర్లలో రాసి ఉంది. నిజమైన రంగులు వెలిసిపోవు, బైబై మోదీ అనే ట్యాగ్‌లతో ఈ పోస్టర్లు వెలిశాయి.