మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయం – కల్వకుంట్ల కవిత

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక నివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట అని..హుజుర్ నగర్, నాగార్జున సాగర్ లాగానే మునుగోడు లో టీఆర్ఎస్ గెలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా లో సంక్షమ పథకాలు ఆపలేదని…పెన్షన్లు లాంటివి అన్ని ప్రజలకి అందించామని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.

పార్టీని, ప్రభుత్వాన్ని నడపటం లో ప్రజల్ని నడపటం లో కూడా కేసీఆర్ ముందు ఉంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాబోతుంది..నల్లగొండ టిఆర్ ఎస్ కు కంచుకోట అన్నారు.ఎన్నిక ఎప్పుడు వచ్చిన విజయం మాదే..మునుగోడు లో మా ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని పేర్కొన్నారు. బీహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తుంది.బిజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుంది..ప్రజాస్వామ్య లో ఇది మంచిది కాదని వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుందన్నారు.