BRS పార్టీ విస్తరణకు సీఎం కేసీఆర్ వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ, రేపు రాజ శ్యామల యాగాలు పూజా కార్యక్రమాలు చేయనున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు ఆయన సతీమణి.
ఇక రేపు BRS party కార్యాలయ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే యాగశాల నిర్మాణం పూర్తఅయింది. యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు.
నవ చండీ హోమము,రాజశ్యామల హోమము ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో జరగనున్నాయి యాగాలు… దైవ కృప ,బీఆర్ఎస్ విజయవంతం కావడం ,దేశం సుభిక్షంగా ఉండటానికి యాగాన్ని నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.