కేసీఆర్ క్లియర్ స్ట్రాటజీ..ఎమ్మెల్యేలకు డేంజర్ సిగ్నల్స్.!

-

నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి కే‌సి‌ఆర్ పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీలు ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఎందుకంటే సొంత పార్టీలో కొందరు నేతల వైఖరి సరిగ్గా లేదు..పైగా ఎక్కడకక్కడ అంతర్గత పోరు జరుగుతుంది. సీట్ల విషయంలో రచ్చ ఉంది.

అలాగే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో కే‌సి‌ఆర్ ఆచితూచి  అడుగులేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడే సీటు లేదని చెబితే ఇబ్బంది..వారు వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించుకున్న కే‌సి‌ఆర్..కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని గుర్తించారు. అలాంటి వారికి సీటు లేదని చెప్పకుండా..ఇంకా మారడానికి సమయం ఇస్తున్నారు.

ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం ఉంది..ఈలోపు ప్రజల్లోకి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకోవాలని, అప్పటికి సరిగ్గా లేకపోతే వారిని మార్చేయడం గ్యారెంటీ అని కే‌సి‌ఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. తాజా సర్వేల్లో 15 మంది ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడలేదని తెలిసింది. వారికి కే‌సి‌ఆర్..వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది..అదే సమయంలో ఎన్నికల వరకు అవకాశం కూడా ఇచ్చారట.

ఎన్నికల్లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. అప్పటికి సరిగ్గా లేకపోతే..వారికి సీట్లు ఇవ్వడం కష్టమే అని తేల్చేసి చెప్పారట. అయితే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రమే ఉందని తెలిసింది. వారు ఎన్నికల సమయానికి కూడా మెరుగు పడటం కష్టమే అని పరిస్తితి. అలాంటి వారికి కే‌సి‌ఆర్ సీట్లు డౌటే అని తేలిపోయింది. కాబట్టి వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని రెడీ చేస్తున్నారట. మొత్తానికి మళ్ళీ గెలుపే లక్ష్యంగా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news