సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కర్ణాటకలో బిజెపిని గెలిపించేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ కి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కర్ణాటకలో బిజెపిని ఓడగొట్టాలని చెప్పాలన్నారు. బిజెపి నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీఎస్పీఎస్సీ పేపర్లను అంగట్లో అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ షాపుల్లో దొరుకుతున్నాయన్నారు. నిరుద్యోగుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదన్నారు. ఇక ఈనెల 8న సరూర్నగర్ లో జరగనున్న నిరుద్యోగ మార్చ్ కి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని.. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.