ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ప్రసంగించారు వైఎస్సార్టిపి అధ్యక్షురాలు షర్మిల. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసిఆర్ ఓ హంతకుడిని, నిరుద్యోగుల చావులకు ఆయనే కారణమని ఆరోపించారు. తనకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు షర్మిల.
ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవితాలు బాగుపడతాయని ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ఉద్యమం చేసి రాష్ట్ర సాధనకు కృషి చేశారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఖాజానాను టిఆర్ఎస్ దోచుకుంటుందని విమర్శించారు. మరోసారి కెసిఆర్ ను ఎన్నుకుంటే చీకట్లో ముగిసినట్లేనని హెచ్చరించారు.