తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేయనున్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో ఉండనున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు కూడా అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం అందుతుంది. ఈనెల 11వ తేదీన హైదరాబాద్కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రానున్నారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీపై కీలక చర్చలు నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే ఫ్రంట్ లు అలాగే పొత్తులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఈ జాతీయ పార్టీకి ఏ ఏ పార్టీలు అండగా నిలుస్తాయో చూడాలి.