ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్

-

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు తెలంగాణ భవన్ లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు BRS అధినేత. ఎర్రవల్లి నుంచి నేరుగా సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి వెళ్లనున్నారు కేసీఆర్. పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్ పోర్టు అప్డేట్ చేసుకొని నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు మాజీ సీఎం. అనంతరం అక్కడి నుంచి  తెలంగాణ భవన్ కి వెళ్లనున్నారు కేసీఆర్.

తెలంగాణ భవన్ లో ఇవాళ జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. కేసీఆర్ దాదాపు 7 నెలల తరువాత తెలంగాణ భవన్ కు వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీటీసీలు, జిల్లా ఇన్ చార్జీలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు బీఆర్ఎస్ కీలక నేతలందరూ తెలంగాణ భవన్ కి చేరుకొని కేసీఆర్ ను కలవనున్నారు. సమావేశంలో వారికి పలు కీలక సూచనలు చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version