ఏప్రిల్‌లో ఎన్నికలు..రేవంత్ లాజిక్‌లు.!

-

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో మోదీని గద్దె దింపి..ఢిల్లీలో విపక్ష పర్తిల కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సభ ద్వారా ఇంకా కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో కేంద్రంపై పోరాడుతున్నానని చూపించి.. మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సభ ఊపుతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఫిబ్రవరి చివరిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ లోపు ఎన్నికలు ముగించేయాలని ప్లాన్ చేశారని అంటున్నారు.  ఏప్రిల్‌లోపే ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించడం కోసమే డిసెంబరులో జరగాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేసీఆర్‌ నిర్వహించలేదని, చట్టప్రకారం సమావేశాలను ఆరు నెలల్లోపు జరపకుంటే శాసనసభ రద్దు అవుతుందన్నారు.

అయితే కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికే ప్లాన్ చేసుకుని, ఇలా చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ని ఓడించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన పార్టీ కీలక నేత ఒకరికి సీఎం కేసీఆర్‌ రూ.500 కోట్లు ఆఫర్‌ చేశారని, ఈ కుట్రాలని తెలుసుకుని కాంగ్రెస్ అధిష్టానం..నేతలని పిలిచి మాట్లాడిందని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం వల్ల కర్ణాటకలో పరోక్షంగా బీజేపీకి మేలు జరుగుతుందని, ఆ విషయం తెలుసుకునే మొన్నటివరకు కేసీఆర్ వెనుక తిరిగిన జే‌డి‌ఎస్ నేత కుమారస్వామి..తాజాగా ఖమ్మంలోనే బీఆర్ఎస్ సభకు రాలేదని అన్నారు.

ఇక రేవంత్ ముందస్తు లాజిక్‌లు కాస్త కరెక్ట్ గానే ఉన్నాయి..ఇటు కుమారస్వామి ఎందుకు రాలేదనేది క్లారిటీ లేదు. మరి చూడాలి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news