ఈ నెల 10న సిద్దిపేటలో కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో భాగంగానే.. ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ముగిసిన అనంతరం.. ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి.
కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా తనను ఓడించాలన్న ధ్యేయంతో బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తనను ఏదైనా ఓ కేసులో ఇరికించాలని ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. కానీ ఎక్కడా తాను అవినీతి చేయకపోవడం వల్లే వాళ్లకు దొరకలేదని పేర్కొన్నారు. ఒక దశలో మోదీ తనను అరెస్టు చేయడానికి కుట్ర పన్నారని కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.