మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు – కిషన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు అని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహించారు. అయినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని వెల్లడించారు.

స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.. ఇక ఆట మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించామని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున కార్యకర్త పనిచేశారు. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బీజేపీ కార్యకర్తతో సమానం. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.