టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు : కేటీఆర్

-

 

టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. దేశంలోనే అతి పెద్దదైన వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కొరియాకు చెందిన యంగ్ వన్ గ్రూప్ రూ. 900 కోట్లు పెట్టుబడితో 8 ఫ్యాక్టరీలు పెట్టనుందని, ఇవాళ తాను దానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 12,000 మందికి ఉపాధి దక్కుతుందని ట్వీట్ చేశారు. ఇక కొన్ని నెలల్లో కైటెక్స్ ఫ్యాక్టరీలు ప్రారంభమవుతాయని చెప్పారు.

కాగా, మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మించిన  కాకతీయ మెగా జౌళి పార్క్‌కు వెళ్లనున్నారు. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్ధాపన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news