కోవిడ్ లెక్కలు: బండి సంజయ్ ప్రశ్నకి కేటీఆర్ సమాధానం..

కరోనా సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా వచ్చిన పెనుప్రమాదం ప్రభుత్వాలని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాల కోసం ప్రభుత్వం చాలానే ఖర్చు పెట్టింది. అటు కేంద్రప్రభుత్వం నుండి రాష్ట్రప్రభుత్వాలని సాయం అందింది. ఐతే కరోనా లెక్కల విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 7వేల కోట్ల బడ్జెట్ ఇస్తే ఏమి చేసారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కోవిడ్ పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించిందంటూ బండి సంజయ్ ఆరోపించారు.

ఈ విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలకి స్పందించిన మంత్రి కేటీఆర్, ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అయిన కేటీఆర్, కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 290కోట్ల రూపాయలు మాత్రమేనని దానికి సంబంధించిన ప్రూఫ్ జతపర్చాడు. మరి దీనిపై బీజేపీ శ్రేణులు ఏమంటారో చూడాలి.