స్విట్జర్లాండ్‌లో ఇవాళ్టి నుంచి జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. దావోస్ చేరుకున్న కేటీఆర్‌కు అక్కడి తెలుగువారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
‘‘దేశంలో ఉన్న వాళ్లతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్ నుంచి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుంది. మానవ జీవితం పరిమిత కాలమనే సిద్ధాంతాన్ని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వలన కొంత ప్రచారం లభిస్తోంది.” అని కేటీఆర్ పేర్కొన్నారు.