దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వెళ్తారా ? పాలేరు,హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గోన్న కేటిఆర్…దుబ్బాక ఎన్నికల ప్రచారంకు వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది.వచ్చే నెల 1వ తేదీతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.
దుబ్బాక ఉపఎన్నికల షెడ్యులు కంటే ముందు నుంచే టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార భాద్యతలు నిర్వహిస్తున్నారు .ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలకు దుబ్బాక నియెజకవర్గంలోని మండలాల వారిగా భాద్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఉపఎన్నికలతో పోల్చితే …ఈ ఉపఎన్నికకు రాష్ట్ర స్థాయి నేతల దుబ్బాక వైపు పెద్దగా వెళ్లలేదు.మంత్రులుగా కూడా ఇప్పటి వరకు దుబ్బాక ప్రచారంకు వెళ్లలేదు .సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు నేతలు మాత్రం దుబ్బాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఇప్పటి వరకు టిఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు తీసుకున్న తర్వాత హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో రోడ్ షో నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపారు కేటిఆర్ .ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంకు కేటిఆర్ వెళ్తారా లేదా అన్న చర్చ టిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది .ఎన్నికల ప్రచార గడువు ముగిసే ఒకటి…రెండు రోజుల ముందు వెళ్లి దుబ్బాకలో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందా అని గులాబి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.