నిజాం కాలేజీతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి : మంత్రి కేటీఆర్

-

నేను నిజాం కాలేజీలోనే చదువుకున్నాను. ఈ కాలేజీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఉదయం కేటీఆర్.. నిజాం కళాశాలలో బాలుర వసతి గృహం భవన నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్​లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కళాశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని  గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంతో యూనివర్సిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించడానికైనా సిద్ధమని తెలిపారు. ఉన్నత విద్యకోసం సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ.. ఇతర విశ్వ విద్యాలయాలకు 144 కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, గురుకులాల వల్ల ఉన్నతవిద్య అభ్యసించే అమ్మాయిల శాతం పెరుగుతోందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version