హైదరాబాద్ వాసులకు శుభవార్త… వారంలోగా 60 వేల ఇండ్ల పంపిణీ

హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో… వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు… ఇందులో 60,000 ఇల్లు పూర్తయ్యాయని తెలిపారు.

పూర్తి అయిన 60 వేల పంపిణీ కి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారంలోగా సిద్ధం చేయాలని కేటీఆర్… జిహెచ్ఎంసి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మార్గదర్శకత్వం వెంటనే రూపొందించాలని పేర్కొన్నారు. మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచనలు చేశారు మంత్ర కేటీఆర్. ఈ పూర్తి ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.