బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఉప వంటి చట్టాలను పెట్టాలని సి పీ ఐ రాష్ట్ర కార్యదర్శి కునమునేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. అంతే కాదు tsps ఛైర్మెన్ ను కూడా తొలగించి వుంటే ఇటువంటి పరిస్థితి వుందేదికాదని అన్నాడు. ఈ లీకేజీ లో భాగస్వామ్యం వున్న అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
పదవ తరగతి , గ్రూప్ పరీక్షల్లో ఇటీవల కాలంలో లో పరీక్ష పత్రలు లీక్ కు బిజెపి రాజకీయ ప్రయోజనాలే కారణం అన్నారు. ఇదీ విద్యార్థుల కు తీవ్ర నష్టం అని అన్నారు. పదవ తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారం లో బండి సంజయ్, పలువురికి జరిగిన చాట్ వ్యవహారం లో ఆధారాలు దొరికినట్లు గా వరంగల్ సి పి స్పష్టం చేశారన్నారు. బిజెపి రాజకీయ ప్రయోజనం కోసం ఇలా లీక్ లు చేయడం దారుణమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ బండి సంజయ్ పై మామూలు చట్టాలు పని చేయవని కటినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.