BREAKING : హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తివేత

-

హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు హిమాయత్ సాగర్ రిజర్వాయర్.. నిండు కుండల తలపిస్తున్నది. ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్ కు చేరుకుంది వరద నీరు. దీంతో ఇప్పటికే 10గేట్లలను ఎత్తి వేశారు అధికారులు. ఎగువ ప్రాంతాలు అయిన పరిగి, షాబాద్, వెంకటాపూర్, షాద్‌నగర్ లోని పలు ప్రాంతాల నుండి వరద నీరు హిమాయత్ సాగర్ కు వచ్చి చేరుతుంది. దిగువ ప్రాంతాలైన బండ్లగూడ, కిస్మత్ పూర్, అత్తాపూర్, లంగర్ హౌస్, కార్వాన్, పురానాపూల్ మీదుగా మూసికి నీరు వెళుతుంది.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్

రిజర్వాయర్ నీటి సామర్థ్యం 2.97 టిఎంసీలు

#ప్రస్తుతం 2.37 టిఎంసీలకు చేరుకున్న నీటి సామర్థ్యం

#రిజర్వాయర్ 1780 అడుగుల నీటిమట్టం..

#ప్రస్తుతం 1761 చేరుకున్న నీటి మట్టం..

#ఇన్ ఫ్లో 500 క్యూసెక్కుల

#ఔట్ ఫ్లో 687 క్యూసెకుల

#లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

Read more RELATED
Recommended to you

Latest news