క్లబ్ లో నగ్నంగా యువతుల డాన్సులు.. 9 మంది అరెస్ట్

-

క్లబ్ లో నగ్నంగా యువతుల డాన్సులు చేసిన.. 9 మంది అరెస్ట్ అయ్యారు. అశ్లీల నృత్యాలతో గబ్బు రేపుతున్న క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల దాడులు చేశారు. కే పి హెచ్ బి మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్ ఓ టీ పోలీసుల దాడులు చేశారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు, కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పబ్ లో యువతులను ఏర్పాటు చేసిన పబ్.. పరిమితికు మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే 9 మంది డ్యాన్సింగ్ యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్, డేజె ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్ అరెస్ట్ చేసారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. క్లబ్ మస్తీ పబ్ ఓనర్ శివ ప్రసాద్ రెడ్డి, మేనేజర్లు విష్ణు, కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అలాగే ఈ దాడుల్లో డిజే మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇక నిందితులను కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version