మారిన మహబూబ్‌నగర్ లెక్కలు..పైచేయి ఎవరిది?

మహబూబ్‌నగర్ పార్లమెంట్ లో లెక్కలు మారుతున్నాయి..ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. గత రెండు ఎన్నికలుగా ఇక్కడ ప్రజలు బి‌ఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. పార్లమెంట్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలేలా ఉంది. బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ లో గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలిచింది. పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు వచ్చి..కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్ స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో అన్నీ స్థానాలని బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి మహబూబ్‌నగర్, మక్తల్ అసెంబ్లీ స్థానాల్లో బి‌జే‌పికి లీడ్ వచ్చింది. మిగిలిన స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. అంటే ఈ రెండు స్థానాల్లో ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పితో రిస్క్ ఉంది. రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అటు కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డికి పాజిటివ్ కనిపిస్తుంది. దేవరకద్రలో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది.

షాద్‌నగర్ లో త్రిముఖ పోరు జరగనుంది. ఇక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య పోరు ఖాయం. నారాయణపేటలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య ప్రధాన పోరు జరిగేలా ఉంది. అయితే కాంగ్రెస్, బి‌ఎస్‌పిలు ఇక్కడ బలంగా ఉన్నాయి. దీంతో పోరు రసవత్తరంగా సాగనుంది. మొత్తం మీద మహబూబ్ నగర్ లో ఈ సారి మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు.