‘లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని.. ఇల్లు తగులబెట్టారు’

నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న జంట విషయంలో అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిని తగులబెట్టారు. గందమల్ల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంతో అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు.

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో గ్రామస్థులు భయంతో ఉన్నారు.