హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్ స్పెక్టర్లు బదిలీ..!

-

తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. ఎమ్మెల్యేల విషయం పక్కకు పెడితే.. ఇటీవలే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు కూడా కొంత మందిని బదిలీ చేశారు.

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పై ఫోకస్ పెట్టింది.  తాజాగా హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో పెద్ద ఎత్తున ఇన్ స్పెక్టర్ల బదీలీలు చేపట్టింది. ఈ మేరకు మొత్తం 9 మంది ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కాసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news