వైద్య రంగాన్ని కెసిఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేస్తుంది – విజయశాంతి

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. కెసిఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుండి వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసిందని మండిపడ్డారు. పేద ప్రజల బ్రతుకులతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కారుకు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

“కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేస్తుంది. కరోనాకాలంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు పోయాయి. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. సర్కార్ దవాఖాన్లలో ఉద్యోగాల భర్తీకి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌పై ఒత్తిడి చేసుడు తప్పితే, ఖాళీలను నింపి మెరుగైన సేవలు అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. అన్ని దవాఖాన్లలో కలిపి 12,735 ఖాళీలు ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వమే ప్రకటించింది.

కానీ, నేటికీ ఇందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. దసరా నాటికే పూర్తవ్వాల్సిన ఎంబీబీఎస్ డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ నెల రోజులుగా ముందుకు కదలడం లేదు. కోర్టు కేసులతో మల్టీ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీ మధ్యలోనే ఆగిపోయింది. భారీ సంఖ్యలో స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీలున్నా ఎటువంటి చలనం లేదు. ఇంకో వారం రోజుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నప్పటికీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తడం లేదు.

ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హెల్త్ అసిస్టెంట్ వంటి కీలకమైన పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తరోనని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇలా వైద్య రంగాన్ని కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేస్తుంది. పేద ప్రజల బతుకులతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెప్పడం ఖాయం”. అని సోషల్ మీడియా వేదిక ద్వారా మండిపడ్డారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news