కేటీఆర్, హరీష్ రావు లే కాదు.. బీఆర్ఎస్ నేతల్లో ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం కార్యక్రమం ఆగదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయ మీడియాతో మాట్లాడారు. మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మరుస్తామని అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి చార్మినార్ వరకు సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తామని కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. మూసీ ప్రక్షాళనను
వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ నేతలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తరిమి తరిమి కొడతారని కీలక
వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. అన్ని అప్పులు చేసి కూడా మూసీ అభివృద్ధికి కనీసం రూ.20 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. మూసీ ప్రజల బాధలు తెలుసు కోవడానికే సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని అన్నారు. సీఎం పాదయాత్రను చూసి ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.