కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే : రంగారెడ్డి ఎమ్మెల్యే

-

కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే.. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు అని రంగారెడ్డి ఎమ్మెల్యే మల్ రెడ్డి అన్నారు. మీ లాగా మా సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడలేదు. మేము తిట్లు మొదలు పెడితే మీ కంటే ఎక్కువ తిట్టగలం. చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు. మూసి పక్కన ఉన్న స్థలాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. హరీష్ రావు తన మామపైన కపట ప్రేమ చూపిస్తున్నారు. మూసి నీళ్లు తాపితే కాని కేటీఆర్, హరీష్ రావు కు బుద్ధి రాదు.

రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావు కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి. మా సీఎం రేవంత్ రెడ్డి జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. హరీష్ రావు నువ్వెలా మంత్రి అయ్యావో అందరికీ తెలుసు. కేసీఆర్ కట్టిన గుళ్లో సీఎం పూజలు చేశాడని అంటున్నావు.. యాదగిరి గుట్ట నీ అబ్బ జాగీరా హరీష్ రావు అని ప్రశ్నించిన రంగారెడ్డి ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి ని విమర్శిస్తే పురుగులు పడి పోతారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news