వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికొస్తే.. ఊరుకోబోమన్నారు. వైసీపీ నేతల భార్యలు, కూతుర్ల పై అసభ్యకర పోస్టులు పెట్టినా వదలను. మృగాళ్లా ప్రవర్తించవద్దని.. రౌడీలు, నేరస్తులు వేసుకున్న రాజకీయ ముసుగు తీసేస్తానని పేర్కొన్నారు.
కొందరూ పోలీసులు లూలూఛీ పడితే వారికదే లాస్ట్ డే. టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే. నా దగ్గర మీ కథలు ఏంటి..? బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా శ్రైశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కందుల దుర్గేష్, ఆనం, జనార్థన్ ఉండనున్నట్టు తెలిపారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని.. విజయవాడ నుంచి శ్రీశైలంకి 40 నిమిషాల్లో వచ్చామని తెలిపారు.