త్వరలోనే ఆదిలాబాద్‌ లో ఐటీ పార్క్‌ – కేటీఆర్‌

-

త్వరలోనే ఆదిలాబాద్‌ లో ఐటీ పార్క్‌ నిర్మిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఆదిలాబాద్ లోని BDNT LAB ను సందర్శించిన ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు… మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది. కాని ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన సిఎం కేసీఆర్ గారి విజన్ కు ధన్యవాదాలు అన్నారు.

సిఎం కేసీఆర్ గారి దార్శనికతతో వరంగల్, కరీంనగర్,మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు…వస్తున్నాయని.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలతో పోటీ పడతారన్నారు.

వరంగల్, కరీంనగర్,మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. జోగురామన్న గారి నాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉధ్యమం చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జోగురామన్న గారు ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అడిగారు. ఆయన విజ్ఞప్తిమేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని ప్రకటించారు. విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూమి పుత్రులు కూడా ముందుకు రావాలని కోరారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news