దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దివాళా తీసిందని…బీజేపీ దివాళా తీస్తోందని…దేశంలో ఏర్పడబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూాపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

mallareddy
mallareddy

కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని భద్రకాళి అమ్మావారిని మొక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. వచ్చే దసరా తరువాత కేసీఆర్ దేశ వ్యాప్త రాజకీయాలు భద్రకాళి అమ్మవారి దగ్గర నుంచే మొదలు పెడుతారని ఆయన అన్నారు. కార్మికులారా.. కేసీఆర్ కు మద్దతుగా నిలిచే మన బతుకులు బాగు పడుతాయని ఆయన అన్నారు. ఛార్జీలు తగ్గించుకోవచ్చని ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు వంటి పథకం ఉంటే తన పదవికి రాజీనామా చేసి సన్యాసం పుచ్చుకుంటా అని మల్లారెడ్డి సవాల్ విసిరారు.