కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఆ ఇద్దరు ఒక్కటయ్యారు : మంత్రి శ్రీధర్ బాబు

-

గత ప్రభుత్వ వైఫల్యాల పై సమీక్ష చేస్తాం. ఇంటలిజెన్స్.. లా అండ్ ఆర్డర్ వైఫల్యాల మీద కూడా సమీక్ష ఉంటది. లోపాలు అంటే చర్యలు ఉంటాయి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అని లోపాలు సవరణ చేస్తాం. ఇకపై చిన్న లోపం జరిగినా.. దాడులకు పాల్పడ్డ తీవ్రంగా పరిగణిస్తాం. అయితే కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి పోతుంటారు అనేది అందరికీ తెలుసు. వారి బాధల నుండి బయట పడే పనిలో ఉన్నారు కేటీఆర్.

ఇక్కడ బట్ట కాల్చి మీద వేసే పనిలో ఉంది BRS. ఇక బీజేపీ.. అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపే ఏటీఎం లాగా ఉంది. అలాగే BRS పక్క రాష్ట్రాల కి డబ్బులు పంపలేదా అని మంత్రి ప్రశ్నించారు. అవి కూడా బయటకు వస్తాయి. BRS, బీజేపీ ఇద్దరు ఒకటే లైన్. ఉదయం BRS.. మధ్యాహ్నం బీజేపీ అదే మాట్లాడుతుంది. కాంగ్రెస్ నీ ఎదుర్కోలేక పోతున్నారు.. అందుకే ఇద్దరు ఒక్కటయ్యారు అని శ్రీధర్ బాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version