ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా ఎదుగుతున్న దళిత సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలజడులు సృష్టిస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. మహనీయులు బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లలను అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దని మండిపడ్డారు చిరుమర్తి లింగయ్య.
ప్రభుత్వ ఉద్యోగి పేరుతో అక్రమంగా వేలకోట్లు సంపాదించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దన్నారు. రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. విద్యావంతుడువి, సీనియర్ అధికారివి అయిండి నిజనిర్ధారణ లేకుండా నిరారధమైన ఆరోపణలు చెయ్యడం విడ్డూరం అన్నారు. తనపై, నల్లగొండ, తుంగతుర్తి, ఎమ్మెల్యేలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మేము బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. సిబిఐ, ఎసిబి అధికారులతో ఎలాంటి విచారణలనైనా చేయించాలన్నారు.