బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50 కిలోల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ గుర్తు చేసుకున్నారు.
దాంతోపాటు, అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం మరియు నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్ గారికి నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Congratulated @nikhat_zareen on winning Gold medal in Women’s 50kg Boxing at #CommonwealthGames pic.twitter.com/Bqpa7MN0la
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 24, 2022