నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ హబ్ కు విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేశ్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని చెప్పారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్ స్పేస్‌ను వినియోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్‌లో ఇవాళ నిర్వహించిన జాబ్ మేళాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను కూడా లెక్కచేయకుండా ఉద్యోగార్థులు జాబ్ మేళాకు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళాతో ఎంతోమంది యువతీయువకుల కలలు సాకారం కాబోతున్నాయని కవిత ట్వీట్ చేశారు.
What an energy and what a splendid turnaround amidst massive rains!
Employment, development and new opportunities are the only way forward for a thriving country!
Hopes and dreams are finally coming true for many youngsters today at Nizamabad IT Hub Mega Job Mela. Thankful to… pic.twitter.com/vAeQeNF8NC
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 21, 2023