హైదరాబాద్‌ లో స్కూల్‌కు సెలవు..!

-

రెండు తెలుగు రాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా చాలా చోట్లలో వరదలు వస్తున్నాయి. వాగులు పాంగ్ పొర్లుతున్నాయి. రహదారులు మూసుకుపోయాయి. అయితే హైదరాబాద్ లో కూడా ఈ రోజు ఉదయం నుండి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి.

అందువల్ల స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఆదివారమే కావడంతో.. హైదాబాద్ పరిధిలోని అన్ని స్కూల్స్ కు సోమవారం సెలవు ప్రకటించింది. అయితే భారీ వర్షాల వల్ల వస్తున్న వరదల్లో చాలా మంది కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక వర్షాలే బట్టి ఆ తర్వాత రోజు కూడా స్కూల్స్ పైన నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version