కుల గణన కి నేను వ్యతిరేకి కాదు.. కానీ సూచన చేయాలనుకుంటున్నా అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అన్నారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే ఇండ్లు కట్టుకుంటున్నారు.. భూములు కొంటున్నారు. అలాంటి పరిస్థితిలో కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానంగా ఉంది. అయితే ఈ ప్రక్రియ గజిబిజి లేకుండా సాఫీగా జరగాలి. సుప్రీం కోర్టు 50 శాతం రిజ్వేషన్లను మాత్రమే అంగీకారం ఇచ్చాయి.
కుల గణనతో రిజర్వేషన్ పెంచాలని అనుకున్నా.. కోర్టుల్లో ఇబ్బంది వస్తుంది అనే అనుమానం ఉంది. గ్రామాల్లో అలజడి వచ్చే పరిస్థితి వస్తుంది. కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కుల గణన అని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలా చేస్తే మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఈ కుల గణన మంచిది కాదేమో జాగ్రత్తగా ఉండాలి. అయితే రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. ఆయన వయసుకు తగిన ఉద్యోగం కాదు.. అయినా బాగా పరిపాలన చేస్తున్నారు అని మాజీ సీఎం భాస్కరరావు అభిప్రయపడ్డారు.