వాస్తవాల కంటే కంటే ఊహాగానాలు ఎక్కువ అయ్యాయి..!

-

నిన్నటి నుండి ఎక్కువగా చర్చకు వస్తున్న వార్త N-కన్వెన్షన్ కూల్చివేత. హీరో నాగార్జునకు సంబంధించిన ఈ N-కన్వెన్షన్ FTL లో ఉందంటూ హైడ్రా కూల్చడం.. దాని పైన నాగార్జున కోర్టుకు వెళ్లడం జారిపోయాయి. అయితే ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పేదలు సీరియస్ గా ఉన్నారు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్వయంగా నాగార్జున ట్విటర్ వేదికగా N-కన్వెన్షన్ పై క్లారిటీ ఇచ్చారు.

”N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్ట్, ఏపీ ల్యాండ్ గ్రబ్బింగ్ యాక్ట్, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం.. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను” అని నాగార్జున సోషల్ మీడియాలో తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version