అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం… వ్యక్తి మృతి..!

రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎదుట కరోనావల్ల ఉన్న ఉద్యోగంపోయి ఆర్దికంగా చితికిపోయామనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ కడ్తల్ గ్రామానికి చెందిన నాగులు తెలంగాణ వచ్చాక కూడా తమ బతుకులు మారకపోగా, మారిన దారుణంగా తయారయ్యాయని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సమయంలో జై తెలంగాణ… కేసీఆర్ సార్… అంటూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని రక్షించే ప్రయత్నం చేశారు. సదరు వ్యక్తి శరీరం సగం కలిపోతంతో.. వెంట‌నే ఆటోలో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా.. అత‌ని ప‌రిస్థితి విష‌మించి ఇవాళ చనిపోయాడు.