పటాన్ చెరులో గూండా గిరికి చరమ గీతం పాడుతానన్నారు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. చిట్కుల్ లోని NMR కార్యాలయంలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ స్థానిక నాయకులతో కలిసి “పటాన్ చెరు ప్రజలకు నీలం మధు భరోసా” మ్యానిఫెస్టో ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన తాను అన్ని రకాల సమస్యలను కష్టాలను చూసి స్వశక్తితో ఎదిగానన్నారు.పేదింటి బిడ్డ గా ప్రజల కష్టాలు స్వయంగా తెలుసని ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ మ్యానిఫెస్టో తయారు చేశామన్నారు.
మీ ఇంటి బిడ్డ మీ ఇంటి గుమ్మంలో పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూశానని,ప్రజల కోరిక మేరకు ప్రజాభిష్టానికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించమన్నారు.ఈ పది భరోసాలతో ప్రజలకు కావలసిన విద్య, వైద్యం,ఉపాది తో పాటు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.పరిశ్రమలలో పని చేసే కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు.ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడంతోపాటు మౌలిక వస్తువుతో కల్పనకు సైతం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు.ముఖ్యంగా పటాన్ చెరు ప్రాంతంలో గుండా గిరి ని పూర్తిగా అణచి వేయడంతో పాటు కమిషన్లు లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.