ఇంత దిగజారిన ప్రధానిని చూడలేదు – సిపిఐ నారాయణ

-

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందన్నారు. ఇంత దిగజారిన ప్రధానిని తాను చూడలేదని.. ఇకపై ఇలాంటి ప్రధాని రాడని అన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి మోడీ ప్రధానిగా అనర్హుడని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ని చితకొట్టారని అన్నారు. దక్షిణ భారత దేశం గేట్లు బీజేపీకి మూసేశారని అన్నారు నారాయణ.

కర్ణాటక ఫలితాలు దేశనికే దిక్సుచి లాంటివని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో తమకు ఇంకో అప్షన్ వచ్చిందని అన్నారు. తెలంగాణలో పోటీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్యనే ఉంటుందన్నారు. ఆమెమ్ రాజకీయ సన్యాసం తీసుకోలేదని.. మాక్కూడా సీట్లు కావాలని అన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో మాకు కొత్త అప్షన్ వచ్చిందన్నారు. కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడం లేదని.. కొద్ది రోజులు ఎదురు చూసి సరైన పార్టీతో కలుస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news