హెయిర్‌కు కలర్‌ వేసుకున్నాక చేతులకు అంటిన రంగు పోవాలంటే ఇలా చేసేయండి..!!

-

ఈరోజుల్లో తెల్లజుట్టు అందరీకి వచ్చేస్తుంది.. చిన్నపిల్లలు, పండు ముసలి అని తేడా లేదు.. మనకు వాస్తవాలను అంగీకరించడం కాస్త కష్టంగానే ఉంటుంది.. అందుకే వాటిని కప్పిపుచ్చుతాం.. ముసలి వాళ్లు కూడా వైట్‌ హెయిర్‌ను యాక్సప్ట్‌ చేయడం లేదు.. ఇక యూత్‌ మాత్రం ఊరుకుంటారా..? అందరూ తలకు రంగు వేసుకుంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలను కాసేపు పక్కనపెడితే.. ఎప్పుడు తలకు రంగు వేసినా మీకు ఎదురయ్యే సమస్య.. అది తెలియకుండా చేతులకు, చెవులకు, నుదుటికి అంటుకుంటుంది. దీనివల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా..! అసలు రంగు వేసుకుందే.. తెల్ల జుట్టు కవర్‌ చేయడానికి.. ఇలా చెవులకు, చేతులకు రంగు అంటడం వల్ల మీరు కలర్‌ వేసుకున్నారని అందరికీ తెలిసిపోతుంది.. ఇదొక లొల్లి.. ఇలా హెయిర్‌ డై వేసుకున్నప్పుడు మీ చేతులకు, ఇంకా అవసరం లేని చోట అంటిన రంగును తొలగించే అద్భుతమైన చిట్కా మా దగ్గర ఉంది.

How to Get Soft Hands: Effective Tips & Strategies

మనం ఎవరికైనా హెయిర్ డై రాసినా.. లేదంటే మనం రాసినా.. ఎంతో కొంత మన చేతులకు నుదుటికి. చెవులకు మెడపై భాగాల్లో అంటుకుంటు ఉంటుంది. అయితే సబ్బుతో ఎంత కడిగిన ఆ బ్లాక్ కలర్ పోదు.. రెండు మూడు రోజుల వరకు ఆ కలర్ అలాగే మనకు అంటుకుని ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కాతో ఇక మీకు ఆ సమస్య ఉండదు..

డై వల్ల మనకు అంటని మరకలు తొలగడానికి మనకు టూత్ పేస్ట్ ఉంచే చాలు. మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత, ఈ టూత్‌పేస్ట్‌ను మీకు రంగు వేయకూడదనుకునే ప్రదేశాల్లో రాయండి.. ఆ ప్రదేశంలో ఉన్న రంగు మరక వెంటనే పోతుంది. మీరు వెంటనే టూత్‌పేస్ట్ వేయకపోతే.. ఆ మరక పోదు. నెమ్మదిగా రెండు మూడు రోజులకు గానీ పోతుంది. అయితే మీకు డౌట్ రావొచ్చు.. ఏ టూత్‌పేస్ట్‌ వాడాలి అని.. కేవలం వైట్‌ కలర్‌ టూత్ పేస్ట్‌ను వాడటం వల్ల రంగు వల్ల అంటిన మరక త్వరగా పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news