ఉగ్రవాద కార్యకలాపాలపై నిజామాబాదులో కొనసాగుతున్న NIA సోదాలు

-

తెలంగాణలోని నిజామాబాద్, బైంసాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పిఎఫ్ఐ ( పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి ఇళ్లతో పాటు, అనుమానుతుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నేడు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోను ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాదులో నాలుగు బృందాలతో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.

పిఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా.. మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మొబిన్ లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు వీరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో కేసును ఎన్ఐఎ కి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. భైంసా అల్లర్లతో సంబంధాలపై కూడా ఎన్ఐఎ ఆరా తీస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news