హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే వాహనదారులకు సూర్యపేట పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతర అయిన సూర్యపేట పెద్దగట్టు జాతర కావడంతో ఆయా రూట్లలో పలు వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర ఇవాళ్టి నుంచి దాదాపు 5 రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తరువాత అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర. ఒక ఏడాది మేడారం జాతర జరిగితే.. మరో ఏడాది పెద్దగట్టు జాతర జరుగుటుంది. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తుంటారు.