అంతరించిపోతున్న కాంగ్రెస్ ని మునుగోడు ప్రజలు ఆదరించరు – ఈటెల రాజేందర్

అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని మునుగోడు ప్రజలు బలపరిచే పరిస్థితి లేదన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నియోజకవర్గాలకు నిధులు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు టిఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసి.. ఆయనను ఆర్థికంగా దెబ్బతీశారని అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ కోసం రాజగోపాల్ రెడ్డి పనిచేసారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి అన్ని సమస్యలపై మాట్లాడారని అన్నారు. సర్పంచులకు బిల్లులు రావడం లేదు.. ఈ విషయంపై ఏరోజైనా ప్రశ్నించావా? అసలు రేవంత్ కి సోయి ఉందా? అంటూ మండిపడ్డారు.

రేవంత్ నాలుగు పార్టీలు మారిండని గుర్తు చేశారు. నిరాశ, నిస్పృహలో రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది.. ఎందుకు ప్రజాధారణ కోల్పోతుందనే దానిపై శోధించకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. దేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్ అని విమర్శలు చేశారు. మునుగోడు లో బిజేపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.